వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకే ఉంటుందని వేములవాడ పట్టణ ఆటో యూనియన్ సభ్యులు ప్రకటించారు. గురువారం వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ ఆటో యూనియన్ కార్మికుల కష్టాలు తెలిసే సీఎం కేసీఆర్ ఆటోలకు టాక్స్ రద్దు చేస్తానని ప్రకటించారని, ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, ఇప్పటి వరకు రమేష్ బాబు ఎట్లా అయితే అండగా నిలిచాడో అదే విధంగా రాబోయే రోజుల్లో ఆటో కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు యాచమనేని శ్రీనివాసరావు, అధ్యక్షుడు బత్తుల దేవరాజ్, పార్టీ పట్టణ ఇంచార్జ్ రాజేందర్, నాయకులు జడల శ్రీనివాస్, బాబున్ లతో పాటు 1000 మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు.