# సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్
నర్సంపేట , నేటిధాత్రి :
కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత 60 బొగ్గు బ్లాక్ లను వేలం వేయడానికి నిర్ణయం తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు గనులు అప్పజెప్పడానికి చేసే ప్రయత్నం సింగరేణి సంస్థకు తీరని నష్టమని ఈ నేపథ్యంలో వెంటనే బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ డిమాండ్ చేశారు.బొగ్గు గనులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గని కార్మికుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించే బిజెపి విధానాలను ఎండగట్టేందుకు కార్మికులందరూ ఏకం కావాలని అన్నారు. అన్ని వామపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్న ప్రభుత్వాలు పేడచేవిన పెడతా ఉన్నాయని బొగ్గు గనుల వేలం ఆపేంతవరకు తీవ్రమైన పోరాటాలు సాగిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయమని తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాపాడుకుంటాo మని మాటలు చెప్పిన బిజెపి నాయకులు నేడు పల్లెతూ మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడం సిగ్గుచేటని పేర్కొన్నారు.అందుకు ఈనెల 5 న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని పంజాల రమేష్ పిలుపునిచ్చారు.