మార్కెట్ కమిటి చైర్మన్ పత్తిపాక వెంకటేష్!!!
ఎండపెల్లి(జగిత్యాల ) నేటి ధాత్రి, ధర్మపురి భారాస పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకై ప్రచారంలో భాగంగా రాజారాంపల్లి గ్రామంలో నాగేందర్ అనే దివ్యాంగుడిని కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్బంగా పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ, భారాస ప్రభుత్వం హయాంలోనే దివ్యాంగుల సంక్షేమానికి ఆసరా మరియు అనేక పథకాలతో అర్థికంగా చేయుతనందిస్తూ, మానవత దృక్పథంతో లోపాలను రూపుమాపెందుకు,వారు కూడా సమాజం లో అందరితో పాటు గుర్తింపు ఇవ్వాలని, వారికి,స్కూటీలు, ట్రై సైకిల్, వినికిడి, కృతిమ పరికరాలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లను అందిస్తూ భరోసా కల్పిస్తుందని, మళ్లీ భారాస ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆసరా పథకం , ద్వారా పెన్షన్ లు,సంవత్సరానికి 500 చొప్పున మొత్తం రూ.6000 పెంచుతూ మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగిందని,ఇది మన దివ్యంగా సోదర ,సోదరీమణులకు,ఎంతో మేలు చేకూరుతుందని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ మహ్మద్ రియాజ్, భారాస పార్టీ ఎస్.సి సెల్ కన్వీనర్ చొప్పదండి బుచ్చిలింగం, భారాస పార్టీ సీనియర్ నాయకులు పడిదం వెంకటేష్, గాదెం బాస్కర్, గౌరి చిరంజీవి, యువ నాయకులు దుర్గం క్రిష్ణ, బత్తిని భరత్, ఆరెల్లి బాబారాజు తదితరులు పాల్గొన్నారు.
