మందమర్రి, నేటిధాత్రి:-
ఇటీవల పట్టణంలో నిర్వహించిన సౌత్ ఇండియా స్థాయి కరాటే పోటీల్లో పట్టణానికి చెందిన దాసరి అశ్విత్, దాసరి జశ్విత్ లు సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించారు. పట్టణంలోని లతా గురుకుల, సైనిక్ పాఠశాల కోచింగ్ సెంటర్ లో విద్యభాసం చేస్తున్న అశ్విత్, జశ్విత్ లను బుధవారం కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు, ప్రిన్సిపాల్ లతా వారి ఇరువురిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైతం విద్యార్థులు ముందు ఉండాలని పిలుపునిచ్చారు కరాటేలో రాణించాలని సూచించారు. పిల్లల్లోని నైపుణ్యాన్ని వెలికితీస్తూ, వారికి శిక్షణ ఇచ్చిన వారి గురువు రంగు శ్రీనివాస్ ను సైతం ఆమె అభినందించారు. కాగా దాసరి అశ్విత్, దాసరి జశ్విత్ లు ఇరువురు పట్టణ పోలీస్ స్టేషన్లు హోంగార్డుగా విధులు నిర్వహించే దాసరి శ్రావణ్ కుమార్ కుమారులు కావడం విశేషం.