విలేకరులను న్యూస్ కవరేజ్ చేయకుండా అడ్డుకున్న ఆర్యవైశ్య సంఘం నేత

వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలో ఆదివారం రాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కలశం నిమజ్జనం సందర్భంగా ఆర్యవైశ్యులు చిన్నారులు శ్రీ వాసవి కోలాటo సభ్యులు కోలాటం వేస్తుండగా కవరేజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా విలేకరులను వనపర్తి ఆర్యవైశ్య సంఘం నేత అడ్డుకున్నారు ఇక్కడనుండి బయటికి వెళ్లిపోండని హుకుం జారీ చేశారు . విలేకరులు నిరసన వ్యక్తం చేసి బయటకు వెళ్లారు కొద్దిసేపు తర్వాత మళ్లీ ఒక వ్యక్తి వచ్చి విలేకరులను బుజ్జగించి న్యూస్ కవరేజ్ చేయమని పట్టుబట్టారు . పార్లమెంట్ అసెంబ్లీ కలెక్టర్ సమావేశాలకు విలేకరులను న్యూస్ కవరేజ్ కొరకు అనుమతిస్తారు . వనపర్తి లో ఆర్యవైశ్యుల నియంత పాలన కొనసాగుతున్నద ని ప్రజలు అంటు న్నారు పదవులు ఉద్యోగం డబ్బు ఆస్తులు ముఖ్యం కాదని నైతిక విలువలు ముఖ్యమని ప్రజలు అంటున్నారు . నియంత పాలనను వనపర్తి ఆర్యవైశ్యులు తరిమి కొట్టాలని వనపర్తి ఆర్యవైశ్య మేధావులు అంటున్నారు.. వనపర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నకు వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకొనుటకు పోవాలంటే వనపర్తి ఆర్యవైశ్యులు భయబ్రాంతులకు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి వనపర్తి లో దాదాపు ఆర్యవైశ్యుల ఓటర్ జాబితా10000 దాకా ఉంటుంది వనపర్తి ఆర్యవైశ్యులు చైతన్యవంతులు తెలివితేటలు ఉన్నవారు అన్ని గమనిస్తున్నారు. ఆదివారం రాత్రి జరిగిన సంఘటనపై విలేకరులకు ఆర్యవైశ్య సంఘం నేత క్షమాపణ చెప్పాలని విలేకరులు ఆర్యవైశ్య మేధావులు ప్రజలు అంటున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version