ఈనెల 21న
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లి, పంగిడిపల్లి గ్రామ పంచాయతీల్లో 21వ తేదీ మంగళవారం జరుగనున్న గ్రామసభల ఏర్పాట్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహణ సమాచారం ప్రజలకు తెలిసేలా టామ్ టామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పధకాలు అమలు చేయనున్న సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుండి 20 వ తేదీ వరకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ యోగ్యమైన, వ్యవసాయం చేయని భూముల సమగ్ర సమాచారం సేకరణ చేసారని తెలిపారు. అట్టి జాబితాను గ్రామసభల్లో లబ్ధిదారుల జాభితా చదివి వినిపినించి తుది జాభితా తయారు చేయనున్నట్లు తెలిపారు. నూతన రేషన్ కార్డులకు గ్రామ సభలలో దరఖాస్తుల స్వీకరించాలని తెలిపారు. రేషన్ కార్డులు జారీ అనేది నిరంతర ప్రక్రియని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ఈ నెల 26 న శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రైతు భరోసా, నూతన రేషక్ కార్డులు జారీకి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు క్షేత్రస్థాయి విచారణ చేశారన్నారు. అట్టి జాభితాను గ్రామ సభలలో ఫైనల్ చేయనున్నామని తెలిపారు.
ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామసభలకు విస్తృతమెన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గ్రామ సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు త్రాగునీరు, నీడ వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ లు జారీ చేయడం జరుగుతుందని, రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియ అని చివరి లబ్ధిదారుల వరకు అందించడం జరుగుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెల 21 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో మండల, గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారు లు పాల్గొనాలని సూచించారు. విధులు నికేటాయించి న సిబ్బంది, అధికారులు తప్పని సరిగా గ్రామసభల్లో పాల్గొనాలని ఎలాంటి. మినహాయింపు లేదని ఆయన స్పష్టంగా చేశారు. అత్యవసర పరిస్థితిలో తన అనుమతి తీసుకోవాలని, గ్రామ సభలకు గైర్హాజరైతే తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభలు నిర్వహణలో పక్కాగా మినిట్స్ నమోదు చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు రిజిష్టర్ లో నమోదు చేయాలన్నారు.
అంతకు ముందు రాఘవవరెడ్డిపేటలో వంగా మల్లయ్య ఇంటి వద్ద జరుగుతున్న విచారణ ప్రక్రియను తనిఖీ చేశారు. నమోదులు పరిశీలించి, వంగా మల్లయ్య ఇచ్చిన సమాచారం వాస్తవమా కాదా మల్లయ్యను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శైలజ, తహసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో అనిత, వ్యవసాయ అధికారి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.