10 గంటలలోపు నిమర్జనం పూర్తిచేయాలి
ఈనెల 30న పశువుల సంత టెండర్ల వేలం
పరకాల నేటిధాత్రి(టౌన్)
సోమవారం రోజున సోదా అనిత రామకృష్ణ చైర్ పర్సన్ పురపాలక సంఘం పరకాల అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం అంశాలు ప్రవేశ పెట్టగా
సబ్యులు ఆమోదించారు.
బుధవారం రోజున నిర్వహించే గణేష్ నిమజ్జనం కొరకు పరకాల,సీతారాంపురం, రాజీపేట లలోని నిమజ్జనం ప్రాంతాలలో తగిన ఏర్పాట్లు చేయుటకు,పశువుల సంత, గొర్రెలు,మేకల సంతల టెండర్లు ముగుస్తున్నందున ఈ నెల 30న వేలం నిర్వహించుటకు, దశబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న నిమజ్జనం రోడ్డు పరకాల చలివాగు రోడ్డు పూర్తి చేసి ఈ నిమజ్జనం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తేది 9వ రోజున గణేష్ నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తున్నందున,గణేష్ ఉత్సవ కమిటీ మరియు గణేష్ మండప నిర్వాహకులు అందరు ప్రజలకు,నిమజ్జనం కొరకు వచ్చే ఇతర గణేష్ విగ్రహ వాహనాలకు ఇబ్బంది కల్పించకుండా రాత్రి 10 గం. లలోపు నిమజ్జనం పూర్తి చేయాలని నిర్వాహకులను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ టీ.శేషు,వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,ఒంటేరు సారయ్య, దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,గొర్రె స్రవంతి రాజు, దామెర మొగిలి,నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్,అడప రాము, పసుల లావణ్య రమేష్, శనిగరపు రజిని నవీన్,మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్, బండి రమ సారంగపాణి, పంచగిరి జయ హరికృష్ణ,ఏకు రాజు తదితరులు పాల్గొన్నారు.