రామడుగు, నేటిధాత్రి:
సిద్ధిపేటలో జరిగిన 37వ నేషనల్ షోటోఖాన్ కరాటే టి.హెబ్, ఆర్ కప్ 2023 పోటీలలో భాగంగా వెపన్ కటా, కటా నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఆరు రాష్ట్రాల నుండి పన్నేండు వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈపోటీలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాలరావుపేట అక్షర హైస్కూల్ ఇంగ్లీషు మీడియం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని వెపన్ కటా (నాన్చాక్) అండర్14 విభాగంలో గోల్డ్ మెడల్స్ పి.లాస్య, పి.శివచరణ్ లు, సిల్వర్ మెడల్స్ హర్షిత, ఎల్.శ్రీమాన్, వి.వివేక్, హర్షవర్ధనలు, కటా అండర్ 14 విభాగంలో గోల్డ్ మెడల్స్ జి.వెన్నెల, టి.సాత్యక శివకుమార్, శశివర్ధన్, సౌమ్యలు, సిల్వర్ మెడల్స్ పి.నవ్య, సంతోష్ శివబిందు, వర్షిత్ లు సాధించారు. స్నేహిక, మల్లికార్జున్ లు బ్రాంజ్ మెడల్స్, మరియు వీరందరూ సమిష్టి కృషిలో ఓవరాల్ చాంపియన్ షిప్ కప్ ను గెలుచుకున్నారు. ఈపోటిలకు కరాటే న్యాయనిర్ణేతగా రాపోలు సుదర్శన్ చీప్ జడ్జిగా వ్యవహరించారు. ఎంపికైన క్రీడాకారులు జనవరి 24 నుండి 28 వరకు గోవాలో జరిగే జపనీస్ ట్రైనింగ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ పోటీలకు అర్హత సాదించారు. గెలుపొందిన అక్షర హైస్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు రామడుగు ఎస్సై తోట తిరుపతి చేతుల మీదుగా ట్రోఫి బహుకరణ, మెడల్స్ అందజేశారు. ఈసందర్భంగా అక్షర హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మినుకుల మునీందర్, అడ్మినిస్ట్రేషన్ రాధ, జపాన్ కరాటే అసోసియేషన్ కరీంనగర్ మాస్టర్ సుంకె ఉపాధ్యాయ బృందం గెలుపోందిన విద్యార్థులను అభినందించారు.