శాయంపేట నేటిధాత్రి:
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులు సమాజం లో జరుగుతున్న విషయాలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంలో సేవకులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో
మండలంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ప్రజా అవసరాల మేరకువారికీ అండగా నిలబడుతుంది. మండలం లోని ప్రజలు, రైతులు, వాహనదారులు, బిజినెస్ దారులు, ప్రజా సంఘాలు, యూనియన్ నాయకులకు ఎలాంటి సమస్య ఉన్న శాయంపేట ప్రెస్ క్లబ్ ను సంప్రదించి తమ సమస్యలను చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నారు. అధికారులు పని చేయకపోయినా, లంచం అడిగిన, పోలీస్ స్టేషన్ సమస్యలు ఉన్న ఎవరైనా వేధించిన క్లబ్ దృష్టికి తీసుకురావాలని అధ్యక్షులు కాలేశ్వరం నర్సయ్య ప్రకటనలో తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రెస్ క్లబ్ తెరిచే ఉంటుందని ఆయన తెలిపారు. ఏ లాంటి సమస్య ఉత్పనమైన తమ దృష్టికి తీసుకురావచ్చు అని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి ప్రెస్ క్లబ్ నిరంతరంగా పనిచేస్తూ ఉంటుందని తెలిపారు. ఫోన్ చేయవలసిన నెంబర్ 9951511947,8008068418 సంప్రదించగలరని మనవి.