# ఎస్డిఎఫ్ గ్రాంట్ ద్వారా నియోజకవర్గానికి మరో రూ.6 కోట్ల నిధులు మంజూరు
# జి.వో. నెంబర్ 69 ద్వారా ఉత్తర్వులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
# వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట నియోజకవర్గ దళితులకు,వివిధ కమ్యూనిటీ ప్రజలకు,పలు రోడ్ల నిర్మాణాల పట్ల అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
నియోజవర్గానికి మరో 350 దళితబందు యూనిట్ల మంజూరు చేస్తూ జి.వో. నెంబర్ 69 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది.అలాగే ప్రత్యేక అభివృద్ధి నిధుల గ్రాంట్ ద్వారా నియోజకవర్గానికి మరో రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వం.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పలు అభివృధ్ది నిధుల,పథకాల పట్ల బతుకమ్మ, దసరా పండుగలా కానుకగా ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో కమ్యూనిటీ భవనాలు, గ్రావెల్ రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ ద్వారా రూ.6 కోట్ల నిధులు వినియోగించాలని అధికారులకు సూచనలు తెలిపారు.దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళితబందు పథకం నుండి నియోజకవర్గం వ్యాప్తంగా జి.వో. నెంబర్ 69 ద్వారా మరో 350 దళితబందు యూనిట్ల మంజూరి చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.