గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ అభియాన్ లో భాగంగా అంగన్వాడి సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, గర్భిణి స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది. అనంతరం అంగన్వాడి సూపర్వైజర్ మమత మాట్లాడుతూ చిరుధాన్యాలతోనే సంపూర్ణమైన ఆరోగ్యం ఇమిడి ఉన్నదని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ఆకుకూరలు, కూరగాయలు, మునగ, బీట్రూట్, రక్తహీనత సహినంగా ఉన్నవారు తీసుకుంటే అభివృద్ధి చెంది ఆరోగ్యంగా ఉంటారని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పిల్లలకు తెలపడం జరిగింది. అంగన్వాడి టీచర్ సైన్ల రజిత మాట్లాడుతూ ప్రతిరోజు అంగన్వాడి కేంద్రానికి వచ్చి లబ్ధిదారులు బాలామృతం, కోడిగుడ్లు, తీసుకొని అర్హులైన వారందరూ అంగన్వాడి సెంటర్ లోనే భోజనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, అంగన్వాడి టీచర్ సైన్ల రజిత, పంచాయతీ కార్యదర్శి మహేష్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ లక్ష్మణ్, ఆశా కార్యకర్తలు లత, జమున, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.