ఉప్పల్ నేటిధాత్రి 13:
అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్ మునిసిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై అన్నదానం ప్రారంభించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ డీసీ ఆంజనేయులు , చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ చేతన హరీష్, రమంతా పూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు ,ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి , జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.