రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీప్రగతి హైస్కూల్ లో సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడిమ్యాల ఫారస్ట్ రేంజ్ ఆఫీసర్ బుర్ర లత హాజరై మాట్లాడుతూ పాఠశాలలు విజ్ఞాన కేంద్రాలకి నిలయాలని, ప్రతి విద్యార్థి శ్రద్ధతో గురువుల యొక్క బోధనకి విలువలనిస్తూ రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకి చేరుకోవాలని కేవలం చదువు మాత్రమే జీవితాలని మార్చే శక్తిని ఇవ్వగలదని, సి.వి.రామన్ భారత దేశానికి విజ్ఞాన శాస్త్రంలో 1930లో నోబెల్ బహుమతి తీసుకొచ్చిన గొప్ప మహానుబావుడని, అయన మార్గదర్శకత్వంలో మనం అంతా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈకార్యక్రమంలో నేషనల్ పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మేడలిస్ట్ పులి ఆంజనేయులు గౌడ్, పాఠశాల కరస్పాండెంట్ అన్నదానం రాధాకృష్ణ, ప్రధానోపాధ్యాయులు అలే వెంకట్ నారాయణ, డైరెక్టర్లు మునీందర్ రెడ్డి, భూమయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.