రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మాట అంగన్వాడి బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు విద్యానగర్ ఏరియాలో స్థానిక కౌన్సిలర్ రామిడి ఉమాదేవి- కుమార్ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధించే విద్య, అందించే సేవల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తూ, రెండున్నర సంవత్సరాలు దాటిన పిల్లల్ని అంగన్వాడీలో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అనిత, ఆర్పి మంజుల పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.