:- ప్రైవేట్ పాఠశాలల ఇష్టాను రాజ్య దోపిడి
:- ఆత్మ న్యూనతకు గురవుతున్న విద్యార్థులు
:- పేద మధ్య తరగతి కుటుంబాలను వేధిస్తున్న అక్రమ ఫీజుల వసూలు
మరిపెడ నేటి ధాత్రి.
నూతన విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో పై తరగతి గదులకు వెళ్లి బోధన జరగటం పరిపాటి. అందుకు విరుద్ధంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తు ఫీజులు చెల్లిస్తేనే పై తరగతులకు అనుమతిస్తున్నారు. దీంతో విద్యార్థులు సంబురంగా పై తరగతులకు వెళ్లాల్సిన చిన్నారులు గత తరగతి గదిలోనే కూర్చుని ఆత్మన్యూనతకు గురవుతున్నారు. విద్యా సంవత్సరం మొదలై పది రోజుల్లో నడుస్తున్న నేటికీ గత సంవత్సరపు విద్యార్థులకు పాత తరగతి గదుల్లోనే విద్య బోధన జరుగుతుంది. నేటి వరకు పై తరగతులకు వెళ్లాల్సిన విద్యార్థులకు బోధన నేటికీ ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత విద్యాశాఖ అధికారుల నిర్లిప్తత పేద మధ్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులకు తీవ్రమైన ఆర్థిక భారం కలగచేస్తుంది. మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సెయింట్ ఆగస్టు పాఠశాలలో ముందస్తు అక్రమ ఫీజుల వసులతోపాటు ప్రైవేటుగా పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలల దోపిడీ
తమ విద్యార్థులను ఉన్నతమైన నాణ్యమైన చదువులను చదివించాలని తల్లిదండ్రుల కార్పొరేట్ మోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసుల వసూళ్లకు పాల్పడుతున్నారు. తమ విద్యార్థులను ఉన్నతమైన నాణ్యమైన చదువులను చదివించాలని తల్లిదండ్రుల కార్పొరేట్ మోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసుల వసూళ్లకు అవకాశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెర తీశారు. పట్టణాల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది. దీంతో స్కూలు, హాస్టల్ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, ఆ తర్వాత విద్యార్థులకు పాఠశాలను బట్టి రూ.60 వేల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారి తక్షణమే ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని పరువురు పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.