మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మను మంగళవారం వరంగల్ లోని ‘ఓ’ సిటీ క్యాంప్ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ నేతృత్వంలో..కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆకుతోట కుమారస్వామి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించేందుకు సమగ్ర బీసీ కుల గణన చేపట్టడంలో ముఖ్య భూమిక పోషించిన కొండా సురేఖమ్మను బీసీ కులస్తులందరూ జీవితంలో మర్చిపోలేరన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కిరణముల నిరంతరం బహుజనుల కోసమే పరితపించే మంత్రి కొండా సురేఖమ్మ ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని, ఆయన ఆకాంక్షించారు.