తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామనపల్లి గ్రామంలో కీర్తిశేషులు నిప్పు జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ నేత ముందాటి తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అలాగే ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలు ప్రారంభించారు క్రీడాకారులు ఆటలు సారిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని క్రీడాకారులు ఆటపాటలతో ఉత్సాహంగా ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ గెలుపోటములు సహజమని భేదాభిప్రాయాలు లేకుండా స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవాలని క్రీడలు జీవితంలో ఎదురయ్యే ఒడిదురుకులను ఎదుర్కోవడం నేర్పుతాయని ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల నియోగం తగ్గించి క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఏఎంసీ వైస్ చైర్మన్ నర్సింగ్ గౌడ్ డైరెక్టర్లు కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి బై రీ వేణి రాము. మునిగల రాజు ఎగుర్ల ప్రశాంత్.పొన్నాల లక్ష్మణ్ రాజేశ్వరరావు పొన్నాల పరశురాం.జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి గడ్డం మధుకర్. యువకులు క్రీడాకారులుగ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు