రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,సమాచార హక్కు కమిషనర్, కేసీఆర్ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు అమీర్ లను తెలంగాణ ఉద్యమకారులు సత్కరించారు.కొత్తగూడెం తెలంగాణ భవన్ లో మంగళవారం సాయంత్రం ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మల్లెల ఉషారాణి, బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ శాఖ ఉపాధ్యక్షురాలు కే.మునీల,వారి అనుచరులు ఆర్.మాధవీలత,కే.అపర్ణలు రవిచంద్ర,అమీర్ లకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.