సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు ఉంటాయి.

విద్యుత్ అధికారులు పనుల్లో నిర్లక్ష్యం చేయరాదు.

సిహెచ్ సి సూపర్డెంట్ హాస్పటల్లో ఉన్న సమావేశానికి రాలేదని ఎమ్మెల్యే అగ్రహం.


ఇకపై జిల్లా మండల అధికారులు సమావేశానికి హాజరు కావాలని సభ ఏకగ్రీవ తీర్మానం.

నాయకున్ని కాదు మీ సేవకున్ని సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం రోజున మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారుల పాత్ర ముఖ్యమని అన్నారు, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని, ప్రభుత్వ శాఖలైన ఇరిగేషన్, విద్యుత్తు ,పంచాయతీరాజ్ ,ఈజిఎస్, రెవెన్యూ, అధికారులను వారి యొక్క ప్రగతి నివేదికలను సమావేశంలో వివరించడం జరిగింది, వీటిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వ అధికారులు తమ శాఖలో పెండింగ్లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని పూర్తి చేయని అధికారులపై చర్యలు ఉంటాయని అన్నారు, ముఖ్యంగా మండలంలో విద్యుత్తు సమస్యలు, రెవెన్యూ సమస్యలు చాలా పేరుకుపోయి ఉన్నాయని వాటిపై వెంటనే అధికారులు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను తొందరగా పరిష్కరించాలని అన్నారు, రాబోయే మండల సర్వసభ్య సమావేశంలో మళ్లీ ఈ సమస్యలు పునరావృతం కావద్దని అన్నారు, మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజల కోసమె సేవ చేయడానికి అధికారులు ప్రజాప్రతినిధులుగా ఉన్నామని గుర్తు చేశారు, అలాగే మండలంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దీనిపై పోలీస్ రెవెన్యూ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకొని సంబంధిత వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అన్నారు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు తెగిపోయాయని విద్యుత్ స్తంభాలు వరదలో కొట్టుకుపోయాయని వాటిని పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరినారు, బౌసింగ్ పల్లి పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను గుర్తించి లబ్ధిదారులకు అందజేయాలని, రైతులందరూ కట్టిన విద్యుత్తు డిడిలను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అన్నారు, మండలంలో ఐఎస్ఎల్ పనుల్లో అవినీతి జరిగిందని జిల్లా అధికారి ఒప్పుకోగా వాటిపై వెంటనే విచారణ జరిపి లబ్ధిదారులకు న్యాయం చేయాలని అన్నారు, ప్రతి మండల సర్వసభ్య సమావేశానికి జిల్లా అధికారులు మండల అధికారులు తప్పకుండా ఇకనుండి హాజరు కావాలని ఒకవేళ హాజరుకాని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు, దీనికి సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది, రాబోయేది వేసవికాలం కనుక గ్రామాలలో మంచినీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు, ఎక్కడైనా వాటర్ సమస్య ఉంటే గ్రామపంచాయతీ పరిధిలో బోర్లు వేయించుకొని మంచినీటి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు, సర్పంచుల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా మండలంలోని సర్పంచులను శాలువాలతో ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ జెడ్పీ సీఈవో సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో, అడిషనల్ కలెక్టర్, డి ఆర్ డి ఎ, పి డి, ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జెడ్పిటిసి గొర్రె సాగర్, జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, మండలంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయితీ కార్యదర్శులు గ్రామ అధికారులు, తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!