ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున ఎమ్మార్పీఎస్ టీఎస్ భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ మాట్లాడుతూ. మండల కేంద్రంలో కాటన్ మిల్లర్లు దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రైతుల పంటకు గిట్టుబాటు ధర రాకుండా పూర్తిగా దళారులే కొనుగోలు చేసి రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని రాజయ్య మాదిగ మండిపడ్డారు… మండల కేంద్రంలోని కాటన్ మిల్లర్లు గ్రామ గ్రామాన దళారీ వ్యవస్థ ఏర్పాటు చేసి వారి ద్వారా మాత్రమే కొనుగోలు చేసే విధంగా రైతులను మభ్యపెట్టి వారి యొక్క పంటను చాలా తక్కువ ధర పలికే లాగా చేసి రైతుల నోట్లు మట్టి కొడుతున్నారని తెలిపారు… ఒకవేళ ఎవరో ఒకరు ముందడుగు వేసి మిల్లర్ల దగ్గర అమ్మితే వారికి డబ్బులు సరైన సమయంలో పడకుండా పడకుండా దళారులకు మాత్రం సరైన సమయంలో డబ్బులు పడేలాగా కాటన్ మిల్లర్లు అధికారులను సైతం మేనేజ్ చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని రాజయ్య మాదిగ విచారం వ్యక్తం చేసారు…అంతే కాకుండా తేమ పేరుతో సాకులు చూపి మరో రకంగా రైతులను ఇబ్బంది కాటన్ మిల్లర్స్ ఇబ్బంది పెడుతున్నారని,, నెలలు గడిచిన కూడా వారి అకౌంట్లలో డబ్బులు పడకుండా చేస్తున్నారని ఆరోపించారు..వెంటనే కాటన్ మిల్లర్స్ దలారి వ్యవస్థను బంద్ చేసి నేరుగా రైతుల దగ్గరే షరతులు లేకుండా కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు… వీటిపైన సంబందిత అధికార యంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ స్పందించి కాటన్ మిల్లర్ల పై,, దళ
ళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు…. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు….ఈ కార్యక్రమంలో * ఎమ్మార్పీఎస్ టిఎస్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ,, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల సతీష్ మాదిగ,, భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్ మాదిగ,, మలహర్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ,, మండల నాయకులు తాడికొండ రాకేష్,, చీమల ప్రవీణ్*లు పాల్గొన్నారు.