కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన: డిప్యూటీ ఎంఆర్ఒ రాజీవ్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను జడ్చర్ల కేంద్రం లోని ఎంఆర్ఒ కార్యాలయం వద్ద ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను డిప్యూటీ ఎంఆర్ఒ రాజీవ్ రెడ్డి పంపిణీ చేశారు,ఈ కార్యక్రమం లో 100 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించినట్లు తెలిపారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు వెంటనే చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని డిప్యూటీ ఎంఆర్ఒ రాజీవ్ రెడ్డి అన్నారు, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి సేవలందించాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించినట్లు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిత్యానందం, అశోక్, టౌన్ అధ్యక్షుడు మిన్ హజ్, ఖాజా పాషా సర్ఫరాజ్,ఖాయ్యుం, బెన్యూ ఎర్ర ఆనంద్ ,ఖాజా, తదితరులు పాల్గొన్నారు,