జమ్మికుంట :నేటిదాత్రి
తీవ్ర గాయాలు హస్పటల్ కు తరలింపు
జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న గుడి మనోహర్ రెడ్డి మరియు మామిడి మధుకర్, శంభునిపల్లి పంచాయతీ కార్యదర్శి ఉదయం 9:40 నిమిషాలకు విధి నిర్వహణలో భాగంగా హుజురాబాద్ నుండి జమ్మికుంటకు వస్తుండగా రాజ పల్లె దగ్గర అశోక్ లేలాండ్ ట్రాలీ సబ్ రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకు ఎక్కే క్రమంలో రోడ్డుపై వస్తున్నటువంటి వెహికల్స్ ని గమనించకుండా నడపడం వల్ల టూ వీలర్ మీద వస్తున్నటువంటి మనోహర్ రెడ్డికి మరియు మధుకర్ కు టక్కర్ కావడం వల్ల మనోహర్ రెడ్డికి తీవ్ర గాయాలు అయినవి మధుకర్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు
