విద్యారంగా పెండింగ్ సమస్యలు వెంటనే పరీక్షించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలంలోని వివిధ పాఠశాలలో భోజన విరామ సమయంలో తెలంగాణ ప్రాంత రాజన్నసిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయ సంఘ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా సాంస్కృతిక కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి డిఏలు పిఆర్సి ఈ కుబేర్ లో పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను మెడికల్ జిపిఎఫ్ రిటైర్మెంట్ సరెండర్ లీవ్ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ధర్మాగ్రహ కార్యక్రమంలో నేడు మండలంలో పలు పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమం చేపడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తపస్ రాష్ట్ర జిల్లా మండల మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగిందని తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version