శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం రాజు పల్లి గ్రామానికి చెందిన ఆవుల దిలీప్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఆన్లైన్ లో టెలిగ్రామ్ యాప్ కు సంబంధించిన ఫేక్ ట్రెండింగ్లో 1,60,000 పెట్టుబడి పెట్టగా తనకు మోసం జరగడంతో తన తండ్రికి చెబితే ఏమైనా అంటాడేమో అని భయంతో ఆదివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వారి వ్యవసాయ పొలం వద్దకి వెళ్లి పురుగుల మందు తాగగా తన తల్లిదండ్రులు చూసి హాస్పిటల్ కి తీసుకొని పోగా ఆ రోజు నుండి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 6:30 గంటలకు మృతి చెందినాడు. మృతుని తండ్రి అయిన ఆవుల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు శాయంపేట ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.