ముత్తారం :- నేటి ధాత్రి
ఎంబీఏ పూర్తి చేసి మూడు సంవత్సరాలైనా ఉద్యోగం రాక వ్యవసాయం పనులు చేసుకోలేక మండల కేంద్రానికి చెందిన మారం రమేష్ రెడ్డి (30) పురుగుల మందు తాగి మృతి చెందాడు ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రమేష్ రెడ్డి ఎంబీఏ పూర్తి అయిపోయి మూడు సంవత్సరాలు అవుతున్న ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటూ వ్యవసాయ పనులకు కూడా రావడం లేదని తండ్రి రాజిరెడ్డి మందలించారు ఉద్యోగం రాకుంటే ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలి అని ఇంట్లో చర్చించుకునేవారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో తండ్రి రాజిరెడ్డి కొడుకును పొలం పనికి రావాలని కోరగా రమేష్ ఇంటిలోనే ఉండిపోయాడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఉండగా గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా పెద్ద పళ్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారన్నారు రమేష్ మృతిపై ఎవరి పైన ఎలాంటి అనుమానం లేదు అని తల్లి మారం పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు