ఒకేసారి పలు ఉద్యోగాలకు ఎంపికైన మహిళ!!

ఎందరో నిరుద్యోగులకు ఆదర్శం!!!
ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు
ఎండపల్లి నేటి ధాత్రి
ఒకేసారి పలు ఉద్యోగాలకు ఎంపిక మహిళ ఎంతో మంది నిరుద్యోగులకు ఆదర్శంగా నిలిచి ఇటు గ్రామస్తులకు అటు తల్లిదండ్రులకు సంతోషానికి అవదుల్లేవు, వివరాల్లోకి వెళితే ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన మహిళా మేడిపల్లి శ్రీవిద్య తండ్రి అంకిరెడ్డి తల్లి లక్ష్మి చిన్నప్పటినుండి కూలి పని చేస్తూ , చదువుల్లో ముందున్న శ్రీవిద్యను ఎంతో ప్రోత్సహించి వివాహం తర్వాత భర్త సాన రాజేందర్ ప్రోత్సాహంతో, ఇంకా తేడాది వెలువడిన వీధి నోటిఫికేషన్లలో దరఖాస్తు చేసి ఇటీవల ఫలితాలు వచ్చిన క్రమంలో ఈ క్రమంలో తన కూతురైన శ్రీవిద్యను గతేడాది వివిధ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి టీజీటీ, పిజిటి జీవ శాస్త్రం ,జే ఎల్ బాటని , వివిధ ఉద్యోగాలకు ఎంపికైంది, తమ యొక్క విద్యాభ్యాసం 10 తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత గూడూరులో, ఇంటర్ సాధన జూనియర్ కళాశాల ధర్మారంలో, డిగ్రీ పీజీ విద్యను కాకతీయ యూనివర్సిటీ లో పూర్తి చేశారు, చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆత్మస్థైర్యాన్ని వీడకుండా, పలు ఉద్యోగాలలో,విజయం సాధించిన శ్రీవిద్యను, తల్లిదండ్రులు పలువురు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version