7న ఖమ్మం లో కేసిఆర్ కు కృతజ్ఞత సభ

బీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడు గా బహుజనుల ముద్దుబిడ్డ వద్దిరాజు రవిచంద్ర ను రెండోసారి ఎంపిక చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కృతజ్ఞత లు తెలుపుతూ ఖమ్మం నగరంలో భారి కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్టు బిఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు తెలిపారు, బైపాస్ రోడ్ లోని గాయత్రి గ్రౌండ్స్ లో సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో మాజీ మంత్రి తెలంగాణ ఉధ్యమ నాయకుడు హరీష్ రావు తో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారని పేర్కోన్నారు ఈ మేరకు మంగళవారం ఆయన సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి సభాస్థలి ని పరిశీలించారు, సభకు జిల్లా నలుమూలల నుండి హాజరయ్యే బీఆర్ఎస్ కార్యకర్తలకు అవసరమైన తాగునీరు మజ్జిగ ఏర్పాట్లు చూడాలని నిర్వాహకులకు సూచించారు. సభా ప్రాంగణంలో స్టేజి మైక్ కుర్చీలు తదితర ఏర్పాట్ల పై కూడా సమీక్షించారు. ఖమ్మం జిల్లా నుంచి బీసి నేతగా ఎదిగిన వద్దిరాజు రవిచంద్ర కు రెండోసారి రాజ్యసభ అవకాశం దక్కడం బిఆర్ఎస్ కార్యకర్తల శ్రమకు తగ్గ ఫలితం అని.. ఇదే ఉత్సాహంతో రేపటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపుకు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలనీ సూచించారు, సభాస్ధలిని పరిశీలించినవారిలో
తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాస్ రావు,
బిఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, , పైడిపల్లి సత్యనారాయణ, డోకుపరతి సుబ్బారావు, బిచ్చాల తిరుమలరావు, కాసాని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version