వేములవాడ నేటి ధాత్రి
ముస్లింల సంక్షేమం కొరకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది
నియోజకవర్గంలోని ముస్లింలందరూ ఏకమై ఒక్క సారి అవకాశం ఇస్తే, సమస్యలన్నీ పరిష్కరిస్తా
బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముస్లిం మైనార్టీలు అంటే ఎనలేని ప్రేమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చల్మెడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ముఖ్యంగా అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని, అందుకే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి ని చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వేములవాడ పట్టణంలో షాదీ ముబారక్ పథకంతో సుమారు 350 మంది ఆడబిడ్డలకు లబ్ది చేకూరిందని, 45మందికి మైనార్టీ బంధు రావాల్సి ఉన్న ఎన్నికల నేపథ్యంలో రాలేకపోయిందని, అది తప్పకుండా వస్తుందని అన్నారు. వేములవాడ పట్టణ ముస్లింల ప్రధాన సమస్యలైన షాదీఖానా నిర్మాణం, గురుకుల పాఠశాల అభివృద్ధి తప్పకుండా చేసి చూపిస్తానని, నియోజకవర్గంలో ఉన్న ముస్లింలందరూ ఏకమై కారు గుర్తుపై ఓటేసి తనను గెలిపిస్తే ముస్లిం మైనారిటీల సమస్యలన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముస్లిం కమిటీ పట్టణ అధ్యక్షుడు అక్రమ్ తో పాటు మరికొంత మంది యువకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరగా వారికి చల్మెడ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముస్లిం సోదరులు అందరూ కలసి చల్మెడను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాస రావు, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచంద్రం, మారం కుమార్, ఇప్పపూల అజయ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవ రెడ్డి, గజానంద రావు, పీర్ మహమ్మద్, రామతీర్థపు రాజు,సలీం, బాబున్, కట్కూరి శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, గూడూరి మధు, కందుల క్రాంతి, ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రం, మసీద్ అధ్యక్షులు, మహమ్మద్ బషీర్, అబ్దుల్ రజాక్, మహమ్మద్ కరీం, మహమ్మద్ మున్నా, మైనార్టీ నాయకులు అంజద్ పాషా, ఇఫ్టేఖార్ హుస్సేన్,గౌస్ బాబా, మహమ్మద్ రఫీ, మహమ్మద్ సలీం, షేక్ అహ్మద్ షరీఫ్,సయ్యద్ అతిక్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.