ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు
వేములవాడ రూరల్ నేటి ధాత్రి
వేములవాడ రూరల్ మండలంలో ని చెక్కపల్లి లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు చదువు కున్న విద్యార్థులు వారంతా చిన్ననాటి స్నేహితులు.. ఒకేచోట చదువుకున్నారు..చదువులు పూర్తి అయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు.
వేములవాడ రూరల్ మండలంలో ని చెక్కపల్లి గ్రామంలో ప్రథమిక ఉన్నత పాఠశాలలో 1991-92 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు శుక్రవారం స్థానిక గ్రామంలో ని శ్రీ వెంకటేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ గా ఎన్నిక అయిన స్నేహితుల్లో ఒక్కరైనా సంపేట గంగరాజు ను శాలువా తో సత్కరించి ఎగుర్ల పర్శరాములు కొడుకు మధు కానిస్టేబుల్ అయిన సందర్భంగా శాలువతో సత్కరించారు అలాగే వంగా తిరుపతి టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గా బొమ్మేన శ్రీనివాస్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షునిగా తలరి సురేష్ చెక్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ పదవి విరమణ సందర్భంగా సన్మానించారు మరియు ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు.
ఇట్టి కార్యక్రమంలో తోటి స్నేహితులు జడ బాలయ్య ఎర్రం శేఖర్ ఆడ్డిక శ్రీనివాస్ రేగుల వెంకటేశం వంగా శ్రీనివాస్ ఎండి పాషా పాల్గొన్నారు

