ఆపదలో ఉన్నామంటే ఆదుకుంటాండు
రక్తదానం చేసిన యువనాయకుడు పుట్ట శ్రీహర్ష్
మంథని :- నేటి ధాత్రి
నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తనవంతుగా సాయం, సేవ చేస్తున్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తనయుడు తండ్రిబాటలోనే అడుగులు వేస్తున్నాడు. ఆపద ఉన్నామని నియోజకవర్గంలోని ఎవరు అన్నా నేనున్నానంటూ భరోసా కల్పించే పుట్ట మధూకర్ తనయుడు పుట్ట శ్రీహర్ష్ పేదలకు తనవంతు సాయం అందిస్తూ తండ్రికి తగిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ కు చెందిన జోగిపర్తి మౌనిక D/O జోగిపర్తి భూమయ్య అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చేరింది. అయితే ఆమెకు అత్యవసర నిమిత్తం రక్తం అవసరం ఉండగా విషయం తెలుసుకున్న పుట్ట శ్రీహర్ష్ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఇప్పటికే అనేక మందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన పుట్ట శ్రీహర్ష్ మరోమారు ఆ ఆడబిడ్డకు రక్తదానం చేసి ప్రాణపాయం నుంచి తప్పించారు