బతుకుతెరువు కోసం వచ్చిన గొర్ల కాపరి విద్యుత్ షాక్ తో మృతి.

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం లోని జీలకుంట గ్రామ శివారులో విద్యుత్ షాక్ కు కు గురై గొర్ల కాపరి మృతి చెందడం జరిగింది. వివరాల్లోకి వెళితే జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోగల ఆబాది జమ్మికుంట గ్రామానికి చెందిన కొమ్ము కొమరయ్య వయసు 60 గత పది రోజుల క్రితం తన స్నేహితులతో గొర్లమంద మేపుకుంటూ బతుకుతెరువు కోసం జీలకుంట గ్రామానికి వచ్చి గత నాలుగు రోజుల నుండి జీలకుంట గ్రామంలో ఓ రైతు పత్తి చేనులో మంద పెడుతూ బుధవారం ఉదయం లేచి కాలకృత్యాలు చేసుకొని వెళ్లి పక్కనే ఉన్న పొలంలో నీరు కనబడడంతోటి పొలం దగ్గరి పంపు నీరు పోయడం కనిపించడం వలన అక్కడికి వెళ్లే క్రమంలో పక్కనే ఉన్న మొక్క జొన్న పెరడి చుట్టూ అడవి పందుల నుండి పంటను రక్షించడం కోసం జీలకుంట గ్రామానికి చెందిన రైతు బంగారు కొమురయ్య తన పంటను కాపాడుకోవడం కోసం కరెంటు వైర్ పెట్టడం వలన అది గమనించక పోవడం తో కాలుకు తగిలి పూర్తిగా కరెంటు వైర్ పైనే బోర్ల బొక్కల పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కొమురయ్యకు ఇద్దరు కుమారులు ఒక కూతురు భార్య కొమురయ్య మరణించిన వార్త విని హుటాఉట్టిన అక్కడికి చేరుకొని విలపిస్తున్న తీరు అందర్నీ కలిసివేసింది బతుకుతెరువు కోసం వలస వచ్చిన కొమురయ్య ఏకంగా కరెంటు ప్రమాదంలో కానరాని లోకానికి వెళ్లిపోవడంతో ఎవరిని చూసుకొని బతకాలి అని ఏడుస్తుంటే పలువురిని కంటతడపెట్టింది.ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్థానిక ఎస్సై అశోక్ రెడ్డి సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని మృతి చెందిన కొమురయ్యను పోస్టుమార్టం పంపించారు.అనంతరం సిఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పంటను కాపాడుకునే క్రమంలో కరెంటు వైర్ పెడితే ప్రమాదం తెలిసి కూడా రైతులు కరెంటు వైర్లు పెట్టి తన తండ్రి చావుకు కారణమైన బంగారు కొమురయ్యపై చర్యలు తీసుకోవాలని మృతి చెందిన కొమురయ్య కొడుకు కొమ్ము సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలియజేశారు.ఈ నేపథ్యంలో కరెంటు షాక్ తో గొర్ల కాపరి మృతి చెందిన విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న కరెంటు ఏఈ రాజమల్లు మాట్లాడుతూ రైతులు అక్రమంగా కరెంటు తన పంట పొలాల చుట్టూ పంటను కాపాడడం కోసం వేసుకుంటున్నారని ఇది చట్టరీత్యా నేరమని పంటలను కాపాడడం కోసం అనేక రకాల పద్ధతులు ఉన్నాయని రైతులు ఇప్పటికైనా తెలుసుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని ఎవరైనా కరెంటు అక్రమంగా వాడిన తమకు కంప్లైంట్ చేయాలని వెంటనే వారిపై చట్టరిత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిన్న మొన్నటిదాకా మాతోటి కలిసిమెలిసి తిరిగిన తోటి స్నేహితుడు ఇలా వికటజీవిగా కనబడడంతోటి తమ గుండెల్లో బండరాయి పడ్డట్టు అయిందని ఇన్ని రోజులు సరదాగా అందరం కలిసి మెలిసి తిరిగిన తను లేడాని తెలవడంతో దుఃఖం ఆపు లేకపోతున్నామని ముగ్గురు గొర్ర కాపర్లు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.తాను లేడన్న విషయం తట్టుకోలేకపోతున్నామని కొమురయ్య ఎంతో మంచి వ్యక్తిని అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి ఒకేసారి దూరం అవడంతో జీర్ణించుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version