మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్త తండా సమీపంలో ఉన్న మౌంట్ బాసిల్ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో జడ్చర్ల వైపు నుండి పాఠశాలకు వెళుతుండగా మలుపు వద్ద వెనక నుండి ఓ లారీ బస్సును బలంగా ఢీకొనడంతో డివైడర్ కు ఢీకొన్న బస్సు ఒకసారి గా బోల్తా పడింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగా భయంతో గురయ్యారు. కాగా ఈ ఘటనలో బస్సు బోల్తాపడడంతో 30 మంది దాకా విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. మరికొందరి విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అందరిని మహబూబ్ నగర్ జిల్లా ఎస్ వి ఎస్,ఆసుపత్రికి తరలించారు. దీంతో 167 వ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ జరిపి కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం.