గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామానికి చెందిన తల్లి తండ్రులు లేని నిరుపేద ఆడబిడ్డ పురాణం స్రవంతి పెళ్లికి తన వంతు సహాయంగా 10000 రూపాయలు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్న గొల్లపల్లి మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఇస్రాజ్ పల్లి మాజీ సర్పంచ్ చిర్ర గంగాధర్, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ లు రేవెల్ల సత్యనారాయణ గౌడ్, పురం శెట్టి పద్మా వెంకటేశం, నేరెళ్ల మహేష్, రేవెల్ల లింగయ్య, గడప రవి తదితరులు పాల్గొన్నారు.
