మంచిర్యాల,నేటి ధాత్రి:
బాలికను వేధిస్తున్న వ్యక్తిపై పోక్సో కేసు
బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధించిన మంచిర్యాల పట్టణానికి చెందిన శివ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు శుక్రవారం తెలిపారు.బాలిక వెంటపడి వేధించడంతో సదరు బాలిక కళాశాలకు వెళ్లడం మానేసింది.ఎందుకు వెళ్లడం లేదని అన్నయ్య నిలదీయడంతో విషయం చెప్పింది.బాలిక అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.