ఉపాధి కొల్పోనున్న గౌడ కులస్తులు
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)
కమలాపూర్ మండల కేంద్రంలో బారి సంఖ్యలో తాటి,ఈత వనం దగ్ధం అయినట్లు గౌడ సంఘం అధ్యక్షుడు జేర్బోతుల శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని తాళ్ల పంపు మంగళ గుట్ట ఏరియాలో రైతులు తమ పంట పొలాల్లో వరి కొయ్యాలకు నిప్పు పెట్టడంతో భారీగా వీసిన గాలి తో చుట్టుపక్కల గల 300 తాటి చెట్లు,100 ఈత చెట్లు గత రాత్రి మంటలకు ఆహుతి అయినట్లు తెలిపారు. దీంతో గౌడ కులస్తులు ఉపాధి కోల్పోయి వీధిన పడతారని సుమారు పది లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు, ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు బాలసాని,జక్కు రవి రవీందర్,పబ్బు రాజు గౌడ్, వీర గౌడ్, చిన్న సాంబయ్య, రవీందర్, మేడిపల్లి రాజు,గోపాల్ తదితరులు విజ్ఞప్తి చేశారు.