ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి :
కాసారం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది అన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.గంగాధర మండలం కాసారం వద్ద రూ.2కోట్ల50లక్షలతో కాసారం- గర్షకుర్తి గ్రామాలకు నూతనంగా వేసిన రోడ్డును గురువారం ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం లోని పల్లెల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాసారం గ్రామ ప్రజల చిరకాల స్వప్నం కాసారం గర్షకుర్తి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్తులకు బీటీ రోడ్డు వేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, సత్తు కనుకయ్య, కంకణాల రాజగోపాల్ రెడ్డి ,బుర్గు గంగన్న, కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.