గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కెటిపిపి అర్టీజన్ కార్మికుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లలో ప్రతిభావంతులైన వారిని ముందుకు తీసుకు పోవడం కోసం బహుజన సాహితి అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రతిభావంతులను గుర్తించి అవార్డులను అందిస్తుంది అందులో బాగంగా కెటిపిపి లో అర్టీజన్ కార్మికుడిగా పనిచేస్తున్న చిలువేరు మల్లయ్య సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ సంవత్సరం పూణే లో జరిగిన కార్యక్రమంలో అక్కడి ప్రభుత్వం చేత మల్లయ్య కు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందించారు అవార్డు తీసుకుని కెటిపిపికి తిరిగి వచ్చిన మల్లయ్య ను తోటి ఉద్యోగులు అర్టీజన్ కార్మికులు అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులు జె చందన్ సింగ్ మోతె తిరుపతి రవిందర్ నాయక్ కందికొప్పుల అనిల్ కుమార్ మేకల శ్రీనివాస్ మోరె కుమార్ బొమ్మకంటి రాజేందర్ ఇనుగాల కుమార్ కొడెపాక రత్నాకర్ మోరె రవి సంపత్ కోల శ్యాం పాల్గొన్నారు