వారం రోజులుగా సాగిన మినీ క్రిస్మస్ వేడుకలు నేటితో సమాప్తం.
నక్షత్రాల తో ముస్తాబైన క్రైస్తవ ప్రార్థన మందిరాలు.
చివరి రోజు ఘనంగా జీసస్ జన్మదిన వేడుకలు.
కుల మతాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు ప్రముఖులు.
మానవ జీవన శైలిలో జీసస్ సందేశం అమూల్యం.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
నాలుగవ శతాబ్ది మధ్యకాలం క్రైస్తవులు డిసెంబరు 25 నాడు,యూదా గోత్రములో అబ్రహాము సంతానంలో,దావీదు కుటుంభం,ఒక కన్యక గర్భము,బెత్లెహేము అనే చిన్న ఊరిలో జన్మించిన యేసు క్రీస్తు జన్మదినం”క్రిస్మస్ డే “వేడుకలను ఉమ్మడి మండలంలో బుధవారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉమ్మడి మండలంలోని సుమారు 40 క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో యేసు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ కేక్, కట్ చేసి ఏసు జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు.
క్రిస్మస్ డే సందర్భంగా ఉమ్మడి మండలంలోని బెతస్త్ర చర్చి లతోపాటు ఇతర క్రైస్తవ ఆరాధన మందిరాల్లో క్రిస్మస్ డే సందర్భంగా గ్రామం మరియు మండలానికి సంబంధించిన ప్రజలు మరియు ప్రముఖులకు ఆహ్వానం పలికి వారి సమక్షంలో క్రైస్తవులు అలాగే క్రైస్తవ బోధకులు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ డే సందర్భంగా గ్రామాల్లోని ప్రజలు అలాగే రాజకీయ నాయకులు ఇతరులు కూడా క్రైస్తవులకు క్రిస్మస్ డే శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు జీసస్ గ్రంథాలను ఉద్దేశిస్తూ జీసస్ అందించిన మార్గదర్శకాలను పాటించాలని వారి సందేశాల్లో చెప్పడం జరిగింది. అలాగే క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ మందిరాల్లో ఏర్పాటు చేసిన విశ్వ సంబరాల్లో పాస్టర్లు క్రిస్మస్ వేడుకల విధి విధానాలతో పాటు యేసు ప్రత్యేక సూత్రాలను బోధించడం జరిగింది.
ఉమ్మడి మండలంలో గత వారం రోజులుగా క్రిస్మస్ వేడుకలకు ముందస్తు ముస్తాబైన ఏసుక్రీస్తు ప్రార్థన మందిరాలు చివరి రోజుటికి మరింత అందంగా ముస్తావించడం జరిగింది. ప్రత్యేకంగా చర్చిలకు నక్షత్రాలు, గ్లోబ్స్, లైటింగ్ను అమర్చడంతో చర్చిలు మరింత అందంగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ డే రోజు చిన్నారులు జీసస్ క్యాప్ గిఫ్ట్ తో పాటు, స్టార్స్ లోగోలు, జీసస్ వేషధారణతో ఎంతో చూడముచ్చటగా కనిపించింది, క్రైస్తవ ప్రార్థన మందిరాలకు వచ్చిన క్రైస్తవులతో పాటు ఇతరులకు కూడా హ్యాపీ క్రిస్మస్ అంటూ స్వాగతం పలకడం ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఉమ్మడి మండలంలోని, మహాదేవపూర్, సూరారం, ఎనకపల్లి ,రాపల్లి కోట, అంబటిపల్లి, కాలేశ్వరం ఎడపల్లి, పలివెల, పంకెన, గ్రామాల్లోని క్రైస్తవ బోధన మందిరాలకు సంబంధించిన పాస్టర్లు పెద్ద మొత్తంలో క్రైస్తవులు, బెగ్లూర్ చర్చి నిర్వాహకులు, దయాకర్, అశోక్, శాంతి, డేనియల్ తో పాటు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు, క్రైస్తవ మత పెద్దలు రామన్న, రవితేజ, పాల్గొన్నారు.