తల్లి దండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకం పై దృష్టి సారించాలి….
కమలాపూర్ సిఐ హరికృష్ణ……
నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) గత వారం రోజులు క్రితం మండలంలోని గూడూరు గ్రామంలోని బంధువుల ఇంటి వద్ద నుంచి ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్లి పోయినా మైనర్ బాలిక ఆచూకీ కనుగొన్నట్లు కమలాపూర్ సిఐ హరికృష్ణ తెలిపారు. మండల కేంద్రంలో విడ్యాభ్యాసం చేస్తున్న మైనర్ బాలిక కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మొహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన మల్దొడ్డి శంకర్ (23) మాల కులానికి చెందిన యువకుడు మాయమాటలతో నమ్మించి బాలికను శారీరకంగా లోబర్చుకున్నట్లు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెతికి పట్టుకున్నట్లుగా, బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా యువకుడిపై రేప్ మరియు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు….
తల్లి దండ్రులు పిల్లల చర్యలను పరిశీలించాలి….. ….
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల యొక్క దినచర్యను గమనించాలని కమలాపూర్ సిఐ హరికృష్ణ విజ్ఞప్తి చేశారు. నేటి సమాజంలో పిల్లలు విచ్చలవిడిగా సెల్ ఫోన్ ఉపయోగిస్తూ చెడు అలవాట్లకు గురవుతున్నారని,ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో అపరిచిత వ్యక్తులు మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్నారని,ఇలాంటి మోసాలకు తమ పిల్లలు గురి కాకుండా,పిల్లల సెల్ ఫోన్ వాడకం పై దృష్టి సారించాలని కోరారు.