తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇట్టి బ్రహ్మోత్సవాలు మాజీ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం పొందారు సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావించి దేవుడి దయతోనే దేవుని దర్శించుకోవడం జరిగిందని ప్రజలందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న వారిలో మాజీ సెస్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న బిజెపి సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోర రాజుతంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ అoకారపు అనిత రవీందర్.మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి బిఆర్ఎస్ పార్టీ నాయకులు జగన్ జగత్ ఆనందం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అభివృద్ధి కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు