పరకాల నేటిధాత్రి టౌన్
శనివారం రోజున చల్లా ధర్మారెడ్డి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో ప్రారంభమైన ఇంటింటి ఎన్నికల ప్రచారం.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ బి ఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోను మరియు బి ఆర్ ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చల్లా ధర్మ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఉడుత సుమన్ యాదవ్,గౌరవ అధ్యక్షులు ఉడుత సమ్మయ్య,బూత్ కన్వీనర్ గునిగంటి రవి గౌడ్, వార్డు కార్యదర్శి అడప సుధాకర్,బీసీ సెల్ అధ్యక్షులు గోపు భాస్కర్,వార్డు ఉపాధ్యక్షులు అడపా వినయ్, సోషల్ మీడియా ఇన్ఛార్జి నల్లెల్ల శ్రీనివాస్,కడవెండి రాజేంద్రప్రసాద్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
