మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 1
నేటితో సర్పంచ్ ల పదవి కాలం ముగియనుండడంతో మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డికి గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు, అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. నిరంతరం ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందిన పెంతల రాజేందర్ రెడ్డి మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి మాట్లాడారు. నన్ను ఆదరించి ఎల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు నేను ఎల్లకాలం విధేయుడిగా ఉంటానని, సర్పంచ్ అనే పదవికి మాత్రమే విరమణ చేస్తున్నానని..ప్రజాసేవకు కాదన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడానికి నాకు సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు కృతజ్ఞత అభివందనలు తెలియజేశారు. అలాగే గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని, వార్డు సభ్యులను, గ్రామపంచాయతీ సిబ్బందిని గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కత్తుల నాగరాజు, పంచాయతీ సెక్రెటరీ ఎండి అజీరా బేగం, వార్డు సభ్యులు గోనె రజిత, కదుర్ల రాజయ్య, మూడెత్తుల లావణ్య, మూడెత్తుల రాజు, కదుర్ల రమ, నిమ్మల భద్రయ్య, నిమ్మల రాణి, కాంగ్రెస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు రాయబారపు వేణు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.