*శిక్షణ కార్యక్రమం లో అధికారులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచన
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం
ఈవీఎం ల కమిషనింగ్ చేయాల్సి ఉంటుందని…. అధికారులు
కమిషనింగ్ ప్రక్రియ పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.
మంగళవారం సిరిసిల్ల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల , వేములవాడలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్ లో సెక్టార్ అధికారులకు, ఏఈఓ లకు ఈవీఎం ల కమిషనింగ్ ప్రక్రియ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు ఖరారు అయ్యాక ఈవీఎం ల కమిషనింగ్ ఉంటుందన్నారు. ఈవీఎం ల కమిషనింగ్ ప్రక్రియ జరిగే పోటీలో ఉండే అభ్యర్థులు కూడా వస్తారని చెప్పారు. పోలింగ్ డే కోసం ఈవీఎం ల సిద్దం చేయాల్సి ఉంటుందన్నారు. ఈవీఎం ల కమిషనింగ్ ప్రక్రియ పై అధికారులు పూర్తి అవగాహనను పెంపొందించుకోవాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే శిక్షణ కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధుసూదన్ ,సిపిఓ పిబి శ్రీనివాసచారి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ తదితరులు ఉన్నారు.