గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండల కేంద్రంలోని టీజిఆర్ స్కూల్ దగ్గర మటన్ లంక గ్రామానికి చెందిన కల్తి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు గత నెలలో అత్తగారింటికి వెళ్తున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో ఒక బాలుడు మృతి చెందిన సంగతి విధితమే. కుటుంబ సభ్యులు త్రీవ గాయాలతో హాస్పటల్లో వైద్యం అందించుకొని ఇంటికి తిరిగివచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి చెందిన సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.
హార్దిక సహాయం అందించిన సివిల్ విద్యార్థి
