ఇద్దరి పై కేసు నమోదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

జమ్మికుంట మండల కేంద్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట ఎక్సైజ్ సిఐ అక్బర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాళ్ళపల్లి స్వామి తండ్రి కనకయ్య, రాపర్తి రవి తండ్రి స్వామి అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 26,730 రూపాయల విలువ చేసే 210 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రమాదేవి, కబీర్ దాస్, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య, కానిస్టేబుల్లు మహేష్, పద్మావతి, శైలజ, రేణుక పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version