సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి పై కేసు నమోదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యక్తిని అవమానపరిచే విధంగా తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన జమ్మికుంటలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుని కథనం ప్రకారం. జమ్మికుంట మండలంలో ” నేటిధాత్రి ” పత్రిక విలేకరిగా పని చేస్తున్న దొగ్గల ప్రకాష్ వార్త సేకరణలో భాగంగా మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామ శివారులోని అసైన్డ్ భూమిలో మట్టి తీస్తుండగా సదరు విషయం పై ” నేటిధాత్రి ” పత్రికలో కథనం ప్రచారం చేయడం జరిగింది. దానిని జీర్ణించుకోలేని కోరపల్లి గ్రామానికి చెందిన పల్లె కుష్ కుమార్ ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమికి సంబంధించిన యజమానితోని ఆ తప్పుడు ఆరోపణలు చేస్తు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. దీని పై అతని పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రకాష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు కాలయాపన చేయడంతో… ప్రకాశ్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు.. కోర్టు ఆ సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో ఇటివల జమ్మికుంట సిఐ బర్పటి రమేష్ సదరు పల్లె కుష్ కుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యక్తిని కించపర్చేవిధంగా పోస్టులు చేసిన సదరు వ్యక్తి పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని పై తగు చర్య తీసుకునే విధంగా దృష్టి సారించాలని బాధితుడు ప్రకాష్ పోలీస్ అధికారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *