ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు శాంతి నగర్,హనుమాన్ నగర్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ఎన్నికల ఇంచార్జి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు వార్డు అధ్యక్షుడు రడపాక రమేష్ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ. భూపాలపల్లి ప్రస్థానం శాంతి నగర్, హనుమాన్ నగర్ నుంచి మొదలైంది. నన్ను ఎవరు పిలవకున్న ఈ వార్డులో కలియ తిరిగి నీటి సమస్య తీర్చేసిన. ఓపెన్ కాస్ట్ లో నష్టపోయిన ఇళ్లకు ప్రభుత్వాన్ని మెప్పించి డబ్బులు ఇప్పించడం జరిగింది.వారసంత వలన ఇబ్బంది ఉంటే అన్ని మౌలిక సదుపాయాలతో బస్ డిపో పక్కన ఏర్పాటు చేయడం జరిగింది.ప్రజల మౌళిక అవసరాలకు అనుగుణంగా భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తూన్నాం
భూపాలపల్లి పట్టణంలో డిగ్రీ పీజీ కాలేజ్, మైనారిటీ ఆశ్రమ పాఠశాల తీసుకుని రావడం జరిగింది.రానున్న రోజులలో మరొక్క అవకాశం కల్పిస్తే భూపాలపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. భూపాలపల్లి పట్టణానికి మాస్టర్ ప్లాన్ తీసుకుని వస్తా. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి 6శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతం తీసుకొచ్చిన విషయం ప్రజలు గమనించాలి.పట్టణ ప్రజలు ఒకటే ఆలోచించాలి అభివృద్ధి,సంక్షేమం సమదృష్టితో సాగిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీకి మరో అవకాశం కల్పించాలని కోరారు.ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్యాస్ 400 ఇస్తాం, ప్రతి ఇంటికి 5లక్షల ప్రమాద భీమా కపిస్తాం, ఆరోగ్య పథకం ద్వారా 15లక్షల వరకు ఆరోగ్య భీమా అందిస్తాం,సౌభాగ్య లక్ష్మిద్వారా ప్రతి మహిళకు 3000 అందిస్తాం.ప్రజలు ఆలోచన చేయాలి,వార్డుల్లో చర్చ పెట్టాలి పనిచేసే ప్రభుత్వం ఏంటో, మాటలు చెప్పే పార్టీ ఏంటో చర్చ జరపాలి.అభివృద్ధి మా నినాదం, సంక్షేమ మా లక్ష్యంగా మీ ముందుకి వస్తున్నాం
పనిచేసే పాలకుడికి, ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు పట్టణ అధ్యక్షుడు జనార్దన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు వార్డు అధ్యక్షుడు రడపాక రమేషు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు