నివాళి అర్పించిన ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్
నేటిధాత్రి, వరంగల్
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా ఏ.ఐ.ఎస్.బి అధ్వర్యంలో వరంగల్ లో 93 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు 23 ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం తమ నిండు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు, ఈ ముగ్గురి విప్లవ వీర కిషోరాల త్యాగం, విశ్వం ఉన్నతవరకు ప్రజా ఉద్యమాలను జ్వలిస్తునే ఉంటుంది అని హకీమ్ నవీద్ అన్నారు, ఇలాంటి మహనీయుల త్యాగాలను అవమానిస్తూ కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయకరణలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 లో నీ పాఠ్య పుస్తకాలలో భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంబేడ్కర్ లాంటి. మహనీయుల చరిత్రను తొలగించే కుట్ర చేస్తుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో ఉన్న ఈ నూతన జాతీయ విద్యా విధానం మధ్యతరగతి విద్యార్ధులకు విద్యను దూరం చేయడమే కాకుండా మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు దూరం చేసే ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020ని విద్యార్థులు, మేధావులు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా భారతి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సంజయ్ మాట్లాడుతూ విద్యార్థులు మహనీయుల అయశల సాధనకై సమ సమాజ స్థాపన కోరకు, చదువు తో పాటు పోరాటాలలో ముందు వరుసలో నిల్వాలని అయన పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకులు బానోతు మోహన్, సతీష్, కుమార్, రాజు, భారతి కళాశాల నాయకులు రంజిత్, సొహెల్, సౌజన్య, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.