శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బ్యాంకుకు వెళ్లి రైతులు రెండు లక్షల రుణం తెచ్చుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న బ్యాంకు వెళ్లి రుణమాఫీ తెచ్చుకోమన్నా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రుణాలు మాఫీ చేయకుండా రైతులను బ్యాంకు చుట్టూ తిప్పుకుంటున్నాడు అదేవిధంగా రైతుబంధు ఎకరానికి 15000 ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తున్నాడు వరికి 500 బోనస్ వరి పంటను కొనుగోలు చేస్తానని చెప్పి కొనుగోలు చేయకుండానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు పంటలు ఎండిపోయి రైతులు చనిపోతుంటే ముఖ్యమంత్రి మంత్రులు వెటకారంగా మాట్లాడుతూ ఎంతమంది రైతులు చనిపోయారో చెప్పు ఎక్స్గ్రేషియా ఇస్తాం అని తిరుగు ప్రశ్నలు వేస్తున్నారు వీళ్లుకూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అహంకారంతో మాట్లాడారో వీళ్ళు అదే విధంగా వీళ్లు అదే విధంగా మాట్లాడుతున్నారు రైతులు పండించిన పంటలకు నీరు అందించే బాధ్యత ఈరాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయి రైతులను మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.