చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలం శాఖ ఆధ్వర్యంలో బిజెపి జెండాను బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఎగరవేయడం జరిగింది
అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 6 1980వ సంవత్సరంలో పండిత్ దీందాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రకాష్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఆనాడు మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీతలు అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ సారాధ్యంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన నాటి నుండి ఎందరో కార్యకర్తల త్యాగాలతోని రెండు పార్లమెంట్ సీట్ల నుండి ఈరోజున భారతీయ జనతా పార్టీ ఒంటరిగా అధికారంలోకి రావడం వెనుక ఎందరో భారతీయ జనతా పార్టీ మహానుభావుల కృషి ద్వారానే భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా సారాజ్యంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జీవితాన్ని దేశాభివృద్ధి కోసం నిరంతరం విరామం లేకుండా ఈ రోజున భారతదేశన్ని ప్రపంచంలోనే ప్రధమ స్థాయిలో నిలబెట్టడం పేద మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం భారతదేశ ప్రజలు కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని అన్నారుఅనంతరం టిఫిన్ పే చర్చలో భాగంగా పార్టీ కార్యకర్తలతో పాల్గొని పార్టీ సంస్థ గత విధానాలు ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలో చర్చించుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గజనాల రవీందర్ పెరుమాండ్ల రాజు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రాయిని శ్రీనివాస్ మండల నాయకులు బూత్అధ్యక్షులు శక్తి కేంద్రీ ఇన్చార్జిలు
కేంసారపు ప్రభాకర్ సాద సాధానందం పిట్టల నాగరాజు కుమారస్వామి చింతల రాజేందర్ అశోక్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.